ప్రతిపక్షం, వెబ్ డెస్క్: పొత్తు ధర్మం పాటించి మిత్ర పక్ష కూటమిని గెలిపించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పొత్తు ధర్మం పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంరక్షణ కోసం మిత్రపక్ష కూటమిని గెలిపించుకోవాలి. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలు ముందుకెళ్లాలి’ అని ఆయన పేర్కొన్నారు.