Trending Now

వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ పొలిటికల్ యాడ్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ఒక ఆసక్తికర పొలిటికల్ యాడ్ ను విడుదల చేసింది. ‘ఫ్యాన్’ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన ‘గాజు గ్లాసు’ అని జనసేన తెలిపింది. ఈ వీడియోలో గత ఎన్నికలకు ముందు జగన్ మాట్లాడిన మాటలతో ప్రారంభమతుంది. నాన్నను చూశారు.. ఒక అవకాశం ఇవ్వండి.. నాన్నగారి కంటే గొప్ప పాలన చేసే ప్రతి ప్రయత్నం చేస్తాననే హామీని మీ అందరికీ ఇస్తున్నానని జగన్ చెప్పిన వ్యాఖ్యలు మొదటగా వస్తాయి. ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. టేబుల్పై న ఉన్న ఫైల్స్ పై ఉన్న రాష్ట్ర అభివృద్ధి, ఇసుక పాలసీ, లా అండ్ ఆర్డర్ అన్ని పేపర్లు ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయి. ఆ వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎగిరిపోయి చిందరవందరగా పడిని పేపర్లను పవన్ ఒక్కొక్కటిగా తీసుకుని.. టేబుల్ మీద పెట్టి దానిపై గాజు గ్లాసు ఉంచుతారు. ఆ తర్వాత పక్కనే జనసేన, బీజేపీ, టీడీపీ గుర్తులు కనిపిస్తాయి. ‘పొత్తు గెలవాలి, ప్రభుత్వం మారాలి’ అంటూ.. యాడ్ ముగుస్తుంది.

Spread the love

Related News

Latest News