ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లూ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు కలిగి ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. నేడు గెలిచిన టీమ్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్ 17, బెంగళూరు 15 గెలిచింది.
ఓపెనర్ల ఊచకోత.. SRH రికార్డు విజయం
లక్నోతో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన SRH 9.4 ఓవర్లలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు హెడ్(89), అభిషేక్(75) LSG బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లిద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. ఈ విజయంతో SRH ప్లేఆఫ్ ఆశలు మరింత మెరుగయ్యాయి.
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో ఆ జట్టు 146* సిక్సర్లు నమోదు చేసింది. 12 మ్యాచ్‌లలోనే SRH ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 145 (2018) రికార్డును బద్దలుకొట్టింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 143 (2019), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 142 (2016), ముంబై ఇండియన్స్ 140 (2023) ఉన్నాయి.