ప్రతిపక్షం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మే 8: ఇండియా కూటమి విజయ రథాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తుందని, రాజరాజేశ్వరుడు దర్శించుకోవడం నా సౌభాగ్యమని ప్రధాని మోదీ అన్నారు. వేములవాడ సభలో నా కుటుంబ సభ్యులారా అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు మోడీ. మూడో దశ ఎన్నికల్లో ఇండియా కూటమి మూడో ఫ్యూజ్ పోయిందని, కరీంనగర్ లో బీజేపీ ఎంపీ విజయం ఖాయమని, ఇక్కడ బీఆర్ఎస్ అడ్రస్ కూడా కనిపిస్తలేదని అన్నారు. ఇండియా కూటమి విజయం వైపు దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అతికష్టం మీద అభ్యర్థిని పెట్టిందని, నిన్న లోక్ సభ మూడో విడత ఎన్నికలు ముగిసాయన్నారు. దేశంలో విజయం వైపు బీజేపీ దూసుకుపోతుందని అన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ విజయం కాయమన్నారు. పదేళ్లు నా పనితీరు మీరు చూశారు. మీ ఓటు బలంతోనే ఈ దేశం ముందుకెళ్లిందని, ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని, అవినీతి పార్టీలని, ఈ రెండు పార్టీలకు తేడా ఏం లేదు రెండు పార్టీలు ఒకటేనని, కాంగ్రెస్ బీఆర్ఎస్ ను అవినీతి కలుపుతుందని, తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాపాడాలన్నారు.