ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఒక మహా మేధావి, దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇచ్చి అపూర్వంగా గౌరవించడం అత్యంత సంతోషదాయకమని దండంరాజు రాంచందర్ రావు అన్నారు. ఇదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ తత్వవేత్త కాంస్య విగ్రహాలను డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆవరణలో, శాసనసభ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసి గౌరవించాలని ఆయన కోరారు. బహు భాషవేత్త పీవీ ని గౌరవించడం అంటే మన తెలంగాణ ముద్దుబిడ్డను మనమే గౌరవించుకోవడమే. ఈ విగ్రహాలు ఏర్పాటు చేయటం ద్వారా భవిష్యత్ తరానికి ఎల్లవేళలా గుర్తుగా ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వందమాగదలు భజనపరులు అంగబలం లేని నిష్కలమైన రాజనీతిజ్ఞుడు. ఉచిత పథకాలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించకుండా వారు తామంతట తాము తమ కాళ్ళపై నిలబడుటకు ఆర్థిక సంస్కరణలు గావించి తద్వారా దేశ స్వయం సమృద్ధికి బాటలు వేసిన మహోన్నతవ్యక్తి పీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదవి కోసం ప్రాకులాడకుండా భూసంస్కరణలు గావించి ఆదర్శప్రాయంగా నిలిచినారు.
మాజీ ప్రధానులు ఇందిరాగాంధీకి అత్యంత విశ్వాసనీయమైన వ్యక్తిగా.. రాజీవ్ గాంధీకి ముఖ్యమైన సలహాదారుగా కాంగ్రెస్ పాలనలో కేంద్ర ప్రభుత్వంలో విశిష్ట స్థానాన్నిపొందారు పీవీ. పీవీ కాంష్య విగ్రహాలను ఇంకా ట్యాంక్ బండతో పాటు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పీవీ కాంస్య విగ్రహాలను అతి త్వరలో ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను అని దండంరాజు రాంచందర్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు.
దండంరాజు రాంచందర్ రావు,
(9849592958)