Rahul Dravid appointed as RR head coach: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్‌తో భారత కోచ్‌గా పదవీకాలం పూర్తిచేసుకున్న ఆయనను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరింది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ సీఈఓ నుంచి ద్రవిడ్ జెర్సీ అందుకున్నారు.
గత మూడేళ్లుగా రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న కుమార సంగక్కర అదే పదవిలోనే ఉండనున్నారు. కాగా, ద్రవిడ్ 2012,2013లో రాజస్థాన్ రాయల్స్ టీం కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా రెండేళ్లపాటు మెంటార్ గా పనిచేశాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024తో భారత్‌ను విజేతగా నిలపడంతో ద్రవిడ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.