Heavy Rain Alert To AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుంది. ఈ మేరకు రేపు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ ప్రభావంతో అక్టోబర్ 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలిన చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 25 వరకు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.