Rajasthan Sub Inspector Recruitment Paper Leak: రాజ్థస్థాన్‌లోని జైపూర్‌లో రాజస్థాన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్ మెంట్ పరీక్ష 2021 పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే ఈ వ్యవహారంపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ విచారణ జరుపుతోంది. తాజాగా, ఈ ఘటనలో ఐదుగురు ట్రైనీ ఎస్‌ఐలు అరెస్ట్ అయ్యారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఈనెల 7వరకు రిమాండ్‌కు అప్పగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.
2021 ఎస్‌ఐ నియామక పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై మొత్తం 61 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని వేర్వేరుగా మూడు ఛార్జిషీట్‌లు దాఖలు చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారిలో శోభా రైకా, ఆమె సోదరుడు దేవేశ్ రైమాలు రాజస్థాన్ పబ్లిష్ సర్వీస్ కమిషన్ సభ్యుడు రామురా రైకా పిల్లలు కావడం గమనార్హం. మిగతా ముగ్గురు మంజుదేవి, అవినాశ్ పల్సానియా, విజేంద్ర కుమార్ గా గుర్తించారు.