Rajya Sabha MP Lakshman From Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ ఎంపీ లక్షణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థపాలన కొనసాగిస్తుందని విమర్శలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారే తప్పా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదన్నారు. ప్రజలకు డైవర్ట్ చేయడానికే హైడ్రాను తీసుకొచ్చారని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులాములుగా మారారని ఎద్దేవా చేశారు. ఉచిత ప్రయాణం పేరుతో బస్సుల సంఖ్య తగ్గించారన్నారు. రాష్ట్రంలో రోగుల సంఖ్య పెరుగుతుందని, వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికీ చాలామంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో చనిపోతున్నారని, 9 నెలల పాలనలో 400 మందికి పైగా రైతులు చనిపోయారన్నారు. ఇక, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.