ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ షూటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక లుక్ లీకైంది. శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ షేర్లు చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయడమే లక్ష్యంగా షూటింగ్ జరుగుతోంది.