ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జోన్ 15: పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరి కూడా పురపాలక సంఘం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని కోరుతూ శనివారం బీఆర్ ఎస్ మైనార్టీల విభాగం నాయకులు మున్సిపల్ డి. జాదవ్ సంతోష్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈద్-ఉల్ అజా (బక్రీద్ పండగ) పురస్కరించుకొని ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు ఎదుర్కాకుండా ప్రతి వీధులలో వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లు ఇతరత్రా వాటిని పంపిణీ చేయాలని కోరారు. గతంలో మాదిరి ఆయా ప్రాంతాలలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లే ఈ యేడు కూడా చేయాలని కోరారు.
నిర్మల్ పట్టణంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న చిరు వ్యాపారులను ఫుట్ పాత్ ల నుంచి తొలగించడం కంటే ముందు వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పురపాలక పాలక పక్షాలు సహకరించాలని కోరారు. తొలగించిన చిరు వ్యాపారుల చెడులను వెంటనే క్రమబద్ధీకరించి సదరు ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకునేలా నిర్మల్ ప్రజా ప్రతినిధులు అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియేడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఇందులో రాష్ట్ర హాజ్ కమిటీ మాజీ గౌరవ సభ్యులు మహమ్మద్ నజీరుద్దీన్, నాయకులు సయ్యద్ ఖాజా అక్రం అలీ, రిజ్వాన్ ఖాన్ ,మహమ్మద్ నాయిమోద్దీన్, మహమ్మద్ హబీబ్,శేఖ్ మునీర్ మీర్జా షోయబ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.