సేవా స్పూర్తితో వికలాంగ కుటుంబానికి బియ్యం పంపిణీ

ప్రతిపక్షం గుండాల మార్చి 13

గుండాల మండల కేంద్రంలో వికలాంగ కుటుంబానికి దాతృత్వంతో శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు.మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త,ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు,మానాల ప్రణీత్ ఆధ్వర్యంలో పాలకుర్తి ఉపేందర్,వీరలక్ష్మి అనే వికలాంగులకు అర క్వింటా బియ్యం అందజేశారు.మానాల ప్రణీత్ కుమారుడు జస్విక్ రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజంలో అవసరమైన వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మానాల,తాటిపల్లి నరసింహారావు, తవిడిశెట్టి నాగరాజు, తవిడిశెట్టి రాంబాబు, శ్రీశైలం,కోడూరి శ్యామ్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News