RTC Employees attacked by auto driver in hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉద్యోగులపై దాడి జరిగింది. అఫ్జల్‌గంజ్ నుంచి కుషాయిగూడకు వెళ్తున్న కుషాయిగూడ డిపోనకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఓయూ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. తమకు దారి ఇవ్వలేదనే కోపంతో దుండగులు బస్సును ఆపి డ్రైవర్‌పై దాడికి దిగారు. వెంటనే వారిద్దరూ దాడికి పాల్పడిన ఆటో ట్రాలీ డ్రైవర్ జాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి జగదీశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా, ఈనెల 20న ఉస్మానియా యూనివర్శిటీ వైజంక్షన్ వద్ద డ్రైవర్‌పై దాడి చేశారు. అప్జల్‌గంజ్ నుంచి ఘట్‌కేసర్ వైపునకు వెళ్తున్న మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ గణేశ్‌పై కొంతమంది దాడి చేశారు. బస్సును రోడ్డుపై ఆపి సీటులో ఉన్న డ్రైవర్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తూ ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు.