ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేయ్యండి

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 10 : ప్రైవేటు పాఠశాలాల్లో ఫీజులు వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీ వేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫామ్, షూ అమ్మకాలు చేయవద్దని హైదరాబాద్, మేడ్చల్ జిల్లా విద్య శాఖ అధికారులు ఇచ్చినట్లుగా నిర్మల్ జిల్లా విద్య శాఖ అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వాలని ఆయన అన్నారు. లేకుంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్లకు చాలా ఇబ్బంది జరుగుతుందని ఆయన అన్నారు.

Spread the love

Related News