Trending Now

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

ప్రతిపక్షం, హైదరాబాద్​, ఫిబ్రవరి 11:
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ అధికారులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం వెలువడిన ఉత్తర్వులలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాశ్​ ను సింగరేణి సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు అదనపు బాధ్యతల్లో ఉన్న కృష్ణభాస్కర్​ ను ప్రభుత్వం తప్పించింది. సీనియర్​ ఐఏఎస్​ అధికారి సబ్యసాచి ఘోష్​ ప్రస్తుత బాధ్యతలతో పాటు ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్​ సీఎస్​ గా, కమిషనర్​ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించింది. ప్రజావాణి రాష్ట్ర నోడల్​ అధికారిగా కాత్యాయినీ దేవిని బదిలీ చేస్తూ స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే సందీప్​ కుమార్​ సుల్తానియాకు ప్లానింగ్​ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్​ సెన్సింగ్​ అప్లికేషన్​ సెంటర్​ (టీజీఆర్​ఏసీ) డైరెక్టర్ జనరల్​ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దివ్య దేవరాన్​ పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే మయాంక్​ మిట్టల్​ ను జలమండలి జాయింట్​ మేనేజింగ్​ డైరెక్టర్​ గా ప్రభుత్వం నియమించింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ శర్మను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వలు జారీ చేశారు.

అలాగే జీహెచ్​ ఎంసీ అదనపు కమిషనర్​ ఎస్​ పంకజ ను మల్కాజిగిరి హెచ్​ఎండబ్ల్యూఎస్​ అండ్​ ఎస్బీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్​ హెచ్​ఎండబ్ల్యూఎస్​ అండ్​ ఎస్బీ ఈడీ గా వెయిటింగ్​ లో ఉన్న సామ్రాట్​ అశోక్​ ను నియమించింది. సైబరాబాద్​ హెచ్​ఎండబ్ల్యూఎస్​ అండ్​ ఎస్బీ ఈడీ గా రంగారెడ్డి జిల్లా సబ్​ రిజిస్ట్రార్​ గా ఉన్న ఎం. సంతోష్​ ను నియమించింది. ఉపాధి శిక్షణ శాఖలో అసిస్టెంట్​ డైరెక్టర్​ గా ఉన్న కె. శశికిరణ్​ చారిని లోక్​ భవన్​ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు నాన్​ క్యాడర్​ అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని తెలిపింది.

Spread the love

Related News