ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 22: కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, అదొక పెద్ద ఝూటా పార్టీ అని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు వంగ నాగిరెడ్డి లు అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణ మూడో వార్డు రంగధాంపల్లిలో బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని కౌన్సిలర్ వంగ రేణుక, తిరుమల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతో పాటు సిద్దిపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక కృషి తోనే సిద్దిపేట అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ అభివృద్ధిని వివరించాలని కోరారు. కాంగ్రెస్ బుటకపు హమీలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఉచిత కరెంటు గురించి క్షుణ్ణంగా వివరించాలని, అందరూ కలిసికట్టుగా పని చేసి సిద్దిపేట పట్టణంలోనే అత్యదిక మెజారిటీ మూడవ వార్డు నుండే రావాలని, అందుకు ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.
రైతులకు కాంగ్రెస్ అన్యాయం.. వంగ నాగిరెడ్డి
రైతులను అన్యాయం చేసింది కాంగ్రెస్ అని రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు వంగ నాగిరెడ్డి అన్నారు. రైతులకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని విస్మరించిందన్నారు. కార్యకర్తలు కంకణబద్దులై బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రాంరెడ్డిని బారీ మేజారీటి గెలిపిచ్చుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ దుర్గారెడ్డి, ప్రతాప్ రెడ్డి, దబ్బెట శ్రీనివాస్, ప్రశాంత్, రాంచంద్రరెడ్డి, నిమ్మ ప్రతాపరెడ్డి, పొట్ల చెరువు అంజనేయులు, జీకురి తిరుమల్, జీకురి శ్రీనివాస్, పొట్లచెరువు హరీశ్, ఈర్ల లింగం, బొడిగె ఆంజనేయులు గౌడ్, జంపల్లి సత్యనారాయణ, గాడిచెర్ల యాదగిరి, శేఖర్, లింగం, రామకృష్ణ గౌడ్, శివకాంత్, సత్తయ్య, సంజీవరెడ్డి, ముఖెశ్ యాదవ్, సింగారం శ్రీనివాస్, దబ్బెట యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.