Special trains for Dussehra.. on these routes: దసరా పండక్కి ఊరెళ్లే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం 644 ప్రత్యేక సర్వీసులు ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్‌నగర్, తిరుపతి రైల్వేస్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే నుంచి 170, ఇతర ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే మీదుగా 115 రైళ్లను నడిపించనున్నారు. మరో 185 రైళ్లు పాసింగ్ త్రూ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ఈ మేరకు రూట్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ- నాగర్ సోల్, సికింద్రాబాద్-మద్లాటౌన్, సికింద్రాబాద్-సుబేదార్ గంజ్, హైదరాబాద్-గోరఖ్ పూర్, మహబూబ్ నగర్-గోరఖ్ పూర్, సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-రక్సాల్,సికింద్రాబాద్-అగర్తాల, సికింద్రాబాద్-నిజాముద్దీన్ , సికింద్రాబాద్-బెర్హంపూర్ , సికింద్రాబాద్- విశాఖపట్టణం ఉన్నాయి.