Trending Now

ఆయన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి..

రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్

ప్రతిపక్షం, జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్ 27: రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజాసేవలో ఉండే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జగిత్యాల పట్టణంలోని ఇందిరభవన్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు అందరు కలిసికట్టుగా ఉండి పని చేయాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ గా జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, దేవేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, బండ శంకర్, పిప్పరి అనిత, మన్సూర్, గుంటి జగదీశ్వర్, మహంకాళి రాజన్న, ప్రభాకర్ రెడ్డి, రమేష్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News