Trending Now

గ్రూప్-1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా కఠిన చర్యలు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ఈనెల 9న జరగనున్న గ్రూప్ 1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్ష, నిబంధనలపై విధుల్లో పాల్గొనే సిబ్బందికి నిర్వహించిన అవగహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు తావునీయకుండా, అత్యంత జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలన్నారు. విధులు నిర్వహించే అధికారులు సమన్వయతో పని చేయాలని సూచించారు. రూట్ అధికారులు తమ లోకేషన్లను ముందస్తుగానే చూసుకోవాలని, శాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు.

ఉదయం 7గంటలకు అధికారులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుంచి 10 గంటలవరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రల్లోకి అనుమతించాలని అన్నారు. ప్రతీ అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులతో సహా, సిబ్బందికి కూడా మొబైల్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు తెచ్చుకునే హాల్ టికెట్, ఫోటో, ఇతర గుర్తింపు కార్డు లతో సరిపోల్చుకోవాలని, బూట్లు, బెల్ట్ లు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల నిఘలో ఉంటాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని, జీరాక్స్ కేంద్రాలు ముసివేయాలన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. అంతక ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా గ్రూప్ 1 పరీక్ష నోడల్ అధికారి ఫైజాన్ అహ్మద్ పరీక్ష నిర్వహనకు తీసుకుంటున్న చర్యలు, ఏర్పాట్లు, అధికారుల విధులు, తదితర అంశాల పై వివరించారు. ఈ సమావేశంలో గ్రూప్ 1 పరీక్ష ప్రాంతీయ సమన్వయకర్త గంగారెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News