ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. అందులో క్రికెటర్లు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో హైదరాబాద్ సత్తా చాటుతోంది. 4 మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలిచి రెండింట్లో ఓడింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. కాగా, ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజామ్ జట్టుతో ఢీ కొట్టనుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో SRH గెలవగా, 7 మ్యాచుల్లో PBKS విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి.