ప్రతిపక్షం, నకిరేకల్, ఏప్రిల్ 18: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై మృతి చెందిన ఆరో తరగతి విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మేడి విజ్ఞప్తి చేశారు. ఇటీవల గురుకుల పాఠశాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో తరచూ ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని అన్నారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలన్నారు డిమాండ్ చేశారు.