Trending Now

దళితులను దూషించిన వారిపై చర్యలు తీసుకోండి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 6 : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కదిలి గ్రామానికి చెందిన ఒక యువకుడు ఫేస్ బుక్ లో దళితులను కించపరిచే విధంగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడాడని వెంటనే అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ సోమవారం అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దిలావర్ పూర్ ఎస్సై కు వినతి పత్రం అందజేశారు. 24 గంటలలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని.. లేనియెడల జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా మహనీయులను, ఆయా సామాజిక వర్గాలను ఉద్దేశిస్తూ తప్పుడు చిత్రాలు మెసేజ్‌లు పెడుతున్న వారిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ శాఖపైనే ఉందని చెప్పారు. సదరు వ్యక్తిపై చట్టాల ద్వారా కఠినమైన రీతిలో చర్యలు తీసుకొని తగిన విధంగా శిక్షలు పడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కే. వెంకట స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కత్తి సుధాకర్, జైల లింగయ్య, సిపురి సిద్ధార్థ, సప్పల రవి, దయాకర్, రజినేష్, ప్రసాద్, మాణిక్యం, సంజయ్ అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News