ప్రతిపక్షం, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి యూపీకు బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు వస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ధర్మపురిలో జరగనున్న జన జాతర సభకు ముఖ్యమంత్రి హాజరయి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జన జాతర సభలో పాల్గొంటారు. రాత్రి 6.30 గంటలకు ఉప్పల్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.