ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సిమ్ మార్పిడికి సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. సిమ్ స్వాప్ లేదా మార్పిడి తర్వాత మొబైల్ నంబర్ పోర్టింగ్‌కు అర్హత పొందేందుకు ఏడు రోజుల నిరీక్షణ సమయం ఉంటుందని వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఇంతకు ముందు సిమ్ స్వాప్ చేసిన సందర్భంలో నిరీక్షణ సమయం 10 రోజులుగా ఉండగా.. తాజా సవరణలో దాన్ని ఏడు రోజులకు తగ్గించింది.