TG Government Orders Allocating 169 Staff To Hydra: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లను డిప్యూటేషన్‌పై హైడ్రా కోసం పనిచేయనున్నారు.
ఇక, హైడ్రాను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అదనపు సిబ్బంది కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనుంది. దీంతో హైడ్రా బుల్డోజర్లు మూసీ వైపు దూసుకెళ్లనున్నాయి. ఈ వారంలో మూసీ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. రెండు రోజుల్లో భారీగా మూసీ ఆక్రమణలను కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది.