TGSPDCL: ఉద్యోగులు లంచం అడిగితే ఫోన్ చేయండి

TGSPDCL CMD Musharraf Farooqui: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు ఎవరైన లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. సీఎండీ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేరకు 040-23454884 లేదా 7680901912 నంబర్లకు ఫోన్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. కొంతమంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డపేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు సైతం వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా..విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని స్పష్టం చేశారు.

Spread the love

Related News