ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 15 : నిర్మల్ జిల్లా కేంద్ర సమీపంలోని సాకేరా గ్రామ చెరువు శిఖంలో అక్రమంగా వెలిసిన వెంచర్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ నీటిపారుదల పోలీస్ శాఖల అధికారులు తొలగించారు. అక్రమంగా వెలిసిన వెంచర్ యజమానులకు పలుమార్లు రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారుల నుండి నోటీసులు జారీ చేసిన మొండికేస్తుండడంతో ఈ విషయంలో సీరియస్ గా అయిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం అక్రమ వెంచర్ను తొలగించినట్లు సోన్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖ్ రఫీ తెలిపారు. సాకేర గ్రామ శివారులో గల సర్వే నంబర్ 66 పరిధిలోని చెరువు కుంటలో ఎలాంటి సంబంధిత శాఖల అనుమతులు తీసుకోకుండా వెంచర్ను తయారుచేసిన వారిపై చట్టపరమైన రీతిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ భూములు చెరువులను ఎవరు ఎలాంటి విధంగా ఆక్రమించుకొని అక్రమ వ్యాపారాలు చేసిన చట్టపరమైన రీతిలో చర్యలు తప్పని గురువారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సమావేశంలో జిల్లా కలెక్టర్ సీరియస్ గా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే స్పందించిన సోన్ మండలం సాకేర గ్రామం చెరువు శిఖంలో గల కుంటలో వెలిసిన అక్రమ వెంచర్ పై రెవెన్యూ, నీటిపారుదల, పోలీస్ శాఖల అధికారులు చేరుకొని తొలగించారు. అక్కడ ఏర్పాటుచేసిన హద్దుల రాళ్లు ఇతరత్రా వాటిని అధికారులు తొలగించి తగిన విధంగా హెచ్చరికలను జారీ చేశారు.