KTR Sensational Comments On Congress Governement: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూ కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ఆయన సోదరులకు రూ.వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సహా మంత్రులు చాలా సందర్భాల్లో ప్రకటించారని గుర్తు చేశారు.
అయితే ప్రభుత్వం ఒకవైపు ఫార్మాసిటీ రద్దు చేశామంటూనే…హైకోర్టులో మాత్రం ఫార్మాసిటీ రద్దు కాలేదని చెబుతోంది. ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ అంటోన్న ప్రభుత్వం.. వాటి కోసం ఒక్క ఎకరం భూమినైనా సేకరించిందా? ఒక్క ఎకరం సేకరించకుండా ఫార్మా సిటీ భూములను ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తారు? ఫార్మాసిటీ వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉంది. అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతామన్నారు. 14 వేల ఎకరాలల్లో, 64 వేల కోట్ల పెట్టుబడులతో మేము ఫార్మాసిటీ ని ప్రతిపాదించామన్నారు. అందుకోసం కండిషనల్ ల్యాండ్ అక్విజేషన్ ను చేశామని వెల్లడించారు.