Trending Now

మరో టాలీవుడ్ ప్రేమజంట ఒకటయ్యారు..

రహస్యంగా హీరో సిద్ధార్థ, అదితిరావు వివాహం..

ప్రతిపక్షం, వనపర్తి జిల్లా ప్రతినిధి, మార్చి 27: మరో టాలీవుడ్ సినీ ప్రేమజంట ఒకటయ్యారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వారు పెళ్లి చేసుకొని ఏడడుగులు వేశారని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన పురోహితులు వీరి పెళ్లి తంతును సంప్రదాయబద్దంగా జరిపించారు. కాగా వివాహం తంతు పూర్తయ్యే వరకు ఆలయంలోకి మీడియాను, స్థానికులను, ఇతరులు ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా ఆలయ కమిటీ సభ్యుల సెల్ ఫోన్లను సైతం లోపలికి అనుమతించలేదని సమాచారం. కాగా వనపర్తి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వర రావు మనుమరాలే అదితి రావు హైదరీ కావడం విశేషం. అలాగే శతాబ్దాల క్రితం వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన రంగనాథ స్వామి ఆలయంలోనే సిద్ధార్థ్, అదితిల వివాహం జరగడం మరో విశేషం.

Spread the love

Related News

Latest News