YCP: మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో వైసీపీకి గడ్డుకాలం ఎదురవుతుంది. పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారుకుంటుండడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నుంచి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి ఇవాళ సాయంత్రంలోగా పార్టీ పదవులకు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

కాగా.. నిన్న వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు తమ రాజీనామా లేఖలను స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించి రాజ్యసభ చైర్మన్‌‌కు అందజేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వెంకటరమణ ప్రకటించగా , కుటుంబ సభ్యులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానని మస్తాన్‌రావు వెల్లడించారు.

Spread the love

Related News