Trending Now

ధాన్యం కేటాయింపు కేసులో ఇద్దరి అధికారుల సస్పెండ్‌

జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైన ఘటన..

ప్రతిపక్షం, ప్రతినిధి నిజామాబాద్‌, మే 31: అధికారంలో ఉన్నప్పుడు బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ బెదిరింపులకు తలోగ్గిన పాపానికి ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. బోధన్ డివిజన్లో తన మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యాన్ని తరలించుకుపోయిన ఘటనపై అధికారులు విచారణ అనంతరం సివిల్‌ సప్లయ్ శాఖ జిల్లా అధికారి చంద్రప్రకాశ్‌, డీఎం జగదీశ్‌ బాబులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఓ పక్కా కొడుకు రాహిల్‌ యాక్సిడెంట్‌ వివాదంలో షకీల్‌ బయటకు రాని విధంగా ప్రభుత్వం కేసులు ఉండగా.. మరోపక్క షకీల్‌కు చెందిన మిల్లులకు డీఎస్‌వో నిబంధనలకు మించి రూ.80 కోట్ల మేర ధాన్యం పంపాడు.

పై ఘటనలపై షకీల్‌ విషయంలో ప్రభుత్వము సీరియస్‌గా వ్యవహరిస్తోంది. షకీల్‌కు చెందిన మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగాను గాడించి సీఎంఆర్‌ కింద ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. ఆ తర్వాత వీటిని వేర్వేరు మిల్లులకు తరలించారు. ప్రభుత్వం మారాక షకీల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాల్పడిన అధికార దుర్వినియోగం పై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు షకీల్‌తో డీఎస్‌వో, డీఎం అంటకాగి ప్రభుత్వానికి నష్టం వచ్చేలా వ్యవహరించటంతో ఇద్దరిపై వేటు వేసింది. వాస్తవంగా ఇది డీఎస్‌వో పరిధిలోకి వచ్చే అంశం. అప్పటికీ డీఎం రాలేదు. షకీల్‌ ఎమ్మెల్యేగా ఉండగా బెదిరింపులు మామూలుగా ఉండేవి కావు. అదే విధంగా డీఎస్‌వోనూ సైతం బెదిరించి కెపాసిటీ నుంచి తన మిల్లులకు ధాన్యాన్ని కేటాయించుకున్నాడు. పాపం ఆ అధికారులు ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి ధాన్యం కేటాయించటం వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టింది.

షకీల్‌కు ధాన్యం కేటాయింపు ఎంతకూ రికవరీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్‌ యాక్టు పెట్టడంతో షకీల్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసు పెండింగ్‌లో పడింది. ఈ విషయం ఆలస్యంగా ప్రభుత్వ చేతకు చేరింది. ఈ కేసులో షకీల్‌ పేరు వెల్లడి కాగానే వెంటనే ఈ ఇద్దరి అధికారులపై వేటు పడింది. కాగా డీఏం ఇది తన పరిధికాదని, షకీల్‌కు ధాన్యం కేటాయింపు జరిగిన సమయంలో తనప్పుడు బాధ్యతలే తీసుకోలేదని, అలాంటప్పుడు తనపై చర్యలు తీసుకోవటంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో తాను కమిషనర్‌ను కలిసి విషయమంతా వెల్లడించేందుకు సిద్ధమవుతున్నారు.

Spread the love

Related News

Latest News