ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తనను జనసేనలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్‌కు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత కౌంటర్ ఇచ్చారు. ‘నేను కూడా పవన్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది..? 2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా.. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని పవన్ కు ఆమె కౌంటర్ ఇచ్చారు.