ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపించింది. కాగా, విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్ కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.