ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓటమి చవిచూశారు. రవిచంద్రపై టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ 11000+ మెజార్టీతో ఘన విజయం సాధించారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరఫున బన్నీ ప్రచారం చేయడాన్ని చాలామంది జనసైనికులు తప్పుబట్టారు. కుటుంబానికి చెందిన జనసేనకు మద్దతివ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.