ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని నటుడు, జనసేన నేత పృథ్వీ అన్నారు. ఉండవల్లిలో నారా లోకేశ్‌తో సమావేశమైన ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. “ఈ నెల 18 నుంచి ప్రచార కార్యక్రమాలు చేపడతాం. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం. 2019లో వైసీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చాను.. ఈసారి వైసీపీ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతా.” అని అన్నారు.