కిషన్ రెడ్డి వెనక కేసీఆర్ ఉన్నారు: రేవంత్

ప్రతిపక్షం, జూన్ 15: తెలంగాణకు రావాల్సిన ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆయన విమర్శించారు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఐఆర్‌ఎఫ్‌సీ రుణం విడుదల కాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

అలాగే, కిషన్ రెడ్డి వెనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని, ఆయన సూచనల మేరకే వ్యవహరిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన నిధులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంటూ, రుణం విడుదలకు గడువు ముగియకముందే కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Spread the love

Related News

Latest News