ప్రతిపక్షం, జూన్ 16: హైదరాబాద్లో ల్యాండ్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి నివాసంలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. తనిఖీల్లో భాగంగా కీలక పత్రాలతో పాటు సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.
ఇంట్లో సంచుల్లో నింపి అటకపై దాచిన రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కూడా జప్తు చేశారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతుండగా, నరహరికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను తెరిపించి మరిన్ని వివరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.














