బకెట్ నీటిలో పడి 16 నెలల చిన్నారి మృతి.. కంచన్‌బాగ్‌లో విషాదం

ప్రతిపక్షం, జూన్ 16: హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 16 నెలల చిన్నారి బకెట్‌లో ఉన్న నీటిలో పడి ప్రాణాలు కోల్పోయింది. హఫీజ్ బాబానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీ-బ్లాక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

కుటుంబ సభ్యులు ఓ వేడుకకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. క్షణిక నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Spread the love

Related News

Latest News