రేపు ఆరుట్లలో సీఎం రేవంత్ పర్యటన.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం

ప్రతిపక్షం, జూన్ 16: రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నెల 17న ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. విద్యా రంగంలో నాణ్యమైన సదుపాయాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ప్రారంభం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love

Related News

Latest News