టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కడమంచి సహదేవుడు

ప్రతిపక్షం, జూన్ 16: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కడమంచి సహదేవుడు నియమితులయ్యారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఆయనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించడంపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బేడ బుడగ జంగం హక్కుల సాధన సమితి నాయకులు హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కడమంచి సహదేవుడిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

రాష్ట్ర అధ్యక్షుడు గగనం వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గగనం దుర్గాప్రసాద్, సామాజిక కార్యకర్త సిరిగిరి రాజశేఖర్, మహిళా నాయకురాలు గగనం అలివేలు తదితరులు పాల్గొని ఆయన రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News