విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ సంపద: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రతిపక్షం, జూన్ 16: విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు, సంపద అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తన జన్మదినాన్ని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నజీబ్‌నగర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు భట్టి తెలిపారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, యూనిఫాంలు, విద్యా సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

గత పదేళ్లుగా పెరగని డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందించడం ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యతనిస్తున్నదానికి నిదర్శనమన్నారు.

భట్టి జన్మదిన వేడుకలు ప్రజాభవన్‌లోనూ ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించి జన్మదిన వేడుకలను జరుపుకున్నాయి.

Spread the love

Related News

Latest News