ప్రతిపక్షం, జూన్ 17: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నేడు నిర్వహించే “ప్రజలతో మంత్రుల ముఖాముఖి” కార్యక్రమంలో మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పాల్గొననున్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులతో పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

















