ప్రభుత్వ విద్యలో నూతన విప్లవం.. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూన్ 17: తెలంగాణలో ప్రభుత్వ విద్యను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన ఆయన, నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించి, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునిక సదుపాయాలతో విద్య అందించడమే లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ విద్య ద్వారానే మట్టిలో మాణిక్యాలైన ప్రతిభావంతులను వెలికితీసి, రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News