సీఎం రేవంత్ లేఖ బూటకం: రాంచందర్ రావు

ప్రతిపక్షం, జూన్ 17: మెట్రో రెండో దశ విస్తరణకు అనుమతులు, నిధుల విడుదల కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి పంపిన లేఖ కేవలం ప్రచారానికేనని కమలదళ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. ప్రాజెక్టుకు అవసరమైన సమగ్ర నివేదికలు, ఆర్థిక సాధ్యాసాధ్యాల ధ్రువపత్రాలు ఇంకా పూర్తిగా సమర్పించలేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అన్ని సాంకేతిక, ఆర్థిక వివరాలను కేంద్రానికి అందజేయాలని ఆయన సూచించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పాతనగరంతో పాటు నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు మెట్రో సేవలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News