రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయ్: కేటీఆర్ విమర్శలు

ప్రతిపక్షం, జూన్ 17: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఒకప్పుడు పంటలతో సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నప్పటికీ కొందరు మంత్రుల ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోందని ఆరోపించారు.

అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షలాది ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు పూర్తి చేసిందో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని కేటీఆర్ విమర్శించారు.

Spread the love

Related News

Latest News