ప్రతిపక్షం, జూన్ 17: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకురావడంపై వచ్చిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే మెస్సీని ఆహ్వానించామని స్పష్టం చేశారు. మెస్సీ ఎలాంటి నేరాలకు సంబంధించిన వ్యక్తి కాదని, అంతర్జాతీయ క్రీడా చిహ్నమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కులాల వారీగా విద్యాసంస్థలు ఏర్పాటు చేశాయని విమర్శించిన ఆయన, కుల వివక్ష నిర్మూలన లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించి క్రీడా రంగానికి మరింత ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు.

















