జర్నలిస్ట్ విప్లవశ్రీకి పెరుగుతున్న మద్దతు

ప్రతిపక్షం, జూన్ 17: నగరంలో జరిగిన ఓ నిరసన కార్యక్రమం కవరేజ్‌కు వెళ్లిన యువ జర్నలిస్టు ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమెకు మద్దతుగా పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. వృత్తి నిర్వహణలో ఉన్న మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఖండనీయమని వారు పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు సంఘీభావం తెలుపుతూ పలువురు పోస్టులు చేస్తున్నారు. మహిళల గౌరవం, వ్యక్తిగత హక్కులను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News