సింగరేణి నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కవిత

ప్రతిపక్షం, జూన్ 17: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గోదావరిఖనిలోని సింగరేణి రాపిడ్ గ్రావిటీ వాటర్ ప్లాంట్‌ను సందర్శించి పరిశీలించారు. ప్లాంట్ పనితీరు, కార్మికులకు అందుతున్న తాగునీటి సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సింగరేణి కార్మికులకు నాణ్యమైన తాగునీరు, మెరుగైన మౌలిక వసతులు అందించడం యాజమాన్యం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికుల సంక్షేమమే తమ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News