ప్రతిపక్షం, జూన్ 18: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక అనిశ్చితి కొనసాగుతోంది. మెట్రో నిర్వహణను ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ, సంస్థకు చెల్లించాల్సిన రూ.13,600 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. దీంతో ప్రాజెక్టు భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నిధులను విడుదల చేయాల్సిన ఆర్థిక సంస్థ నుంచి ఇప్పటివరకు స్పష్టత రాకపోవడంతో చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. నిధుల విడుదల పూర్తైన తర్వాతే ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి చర్యలు వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అదే సమయంలో మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర అనుమతులు కూడా కీలకంగా మారాయి. ఆమోదాలు, నిధుల ప్రక్రియ పూర్తైన తర్వాతే రెండో దశ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మెట్రో విస్తరణపై ప్రయాణికులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

















