కాసేపట్లో సీఎం సమీక్ష.. వర్షాలు, మెట్రో, రైతు భరోసాపై కీలక చర్చ

ప్రతిపక్షం, జూన్ 18: రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు హాజరై ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

వర్షాకాల పరిస్థితులు, వర్షాభావం ప్రభావం, వ్యవసాయ రంగానికి తీసుకోవాల్సిన చర్యలు, రైతు భరోసా నిధుల విడుదల వంటి అంశాలు సమావేశంలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలపై కూడా సమీక్ష జరగనుంది.

అదేవిధంగా మెట్రో రైలు విస్తరణ, ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన తాజా పరిణామాలు, కేంద్రంతో నెలకొన్న అంశాలపై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలు ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది.

Spread the love

Related News